ప్రతి సంవత్సరం డిసెంబరు 25 ను క్రీస్తు పుట్టినరోజుగా జరుపుకుంటారు. క్రీస్తు సీజర్ ఆగస్టస్ పరిపాలనాకాలంలో జన్మించాడని బైబిలులో వ్రాయబడివుంది. క్రీస్తు ఏ నెలలో ఏ తేదీన పుట్టాడనే విషయంలో భేదాభిప్రాయాలున్నా ఆయన జన్మ ఒక చారిత్రక సత్యం. ఎంతో ఉత్సాహంగా క్రిస్మస్ పండుగ జరుపుకునే అనేకులు, క్రీస్తు జన్మ ఎందుచేత మానవాళికి సంతోష కారణమో ఎరుగరు. ఆయన కన్యక గర్భాన జన్మించిన కుమారుడైన దేవుడని వారు ఙ్ఞాపకం చేసుకోరు. నిఖిల మానవాళికీ రక్షకుడు (“యేసు” అంటే హీబ్రూ భాషలో “రక్షకుడు” అని అర్థం) జన్మించాడు గనుకనే క్రిస్మస్ శుభ దినం!