విశ్రాంతి అంటే మనం సాధారణంగా చేసే పనులను చేయక మనతో మన కాలాన్ని గడపడం. మనసులో దిగులు,విచారం ఆందోళన లాంటి భావాలు లేక శాంతి నెలకొనడం. అనాది కాలం నుండీ పనిపాటలకు అలవాటు పడ్డ మనిషి విశ్రాంతి ప్రాముఖ్యతను మరచిపోతున్నాడు. దేవుడు ఆరు రోజుల్లో సృష్టి చేసి ఏడవ రోజు విశ్రమించి దానిని పరిశుద్ధ పరిచాడని బైబిలులో వ్రాయబడివుంది. అంటే విశ్రాంతికీ పవిత్రతకూ ఏదో సంబంధమున్నట్లుగా అవగతమౌతుంది. విశ్రాంతి అంటే ఏ పనీ చేయకుండా ఉండడంకాదుగాని, సాధారణ పనులనుండి దృష్టి మరల్చడం.
యేసు అన్నాడు:” ప్రయాసపడి భారముతో వున్న సకల ప్రజలారా, నా దగ్గరకు రండి. నేను మీకు విశ్రాంతి ఇస్తాను.” లోకంలో చింతాక్రాంతులై భారభరితహృదయులైనవారికి యేసు ఆధ్యాత్మిక “విశ్రాంతి” వాగ్దానం చేశాడు.