దేహాలయం!

జీవాత్మ, పరమాత్మ వేర్వేరు కాదు రెండూ ఒక్కటే అని “అద్వైత” సిద్ధాంతం చెబుతుంది.   అయితే మానవుడు దేవుని సృష్టి అనీ, భౌతిక పరిమితులు గలవాడనీ బైబిలు చెబుతుంది. దేవుడు సమీపించ రాని తేజస్సుతో ఆద్యంత రహితుడై చిరకాలం వెలుగొందే వాడనీ, సర్వలోకానికీ అధిపతియైనవాడు మానవ హస్తకృతాలయాలలో నివసించడనీ వ్రాయబడి వుంది.

చేతితో చేయబడని ఆలయాలలో నివసించడు అంటే హస్తకృతాలు కాని ఆలయాలలో నివసిస్తాడనే అర్థం!

ఒకసారి యేసు యూదులతో ఇలా అన్నాడు:”మీరు ఈ దేవాలయాన్ని  పడగొట్టండి. మూడు రోజుల్లో దీనిని తిరిగి లేపుతాను”.  జెరూసలేంలో 46 యేండ్లు కట్టిన దేవాలయాన్ని పడగొట్టమన్నాడేమో అని యేసు శిష్యులు అప్పుడు భావించారు. అయితే యేసు పునరుత్థానుడైన పిదప ఆయన తన శరీరాన్ని “దేవాలయం”గా వర్ణించాడని వారు గ్రహించారు.

2 స్పందనలు to “దేహాలయం!”

  1. prabhakar అన్నారు:

    jesus is my lord, the lord is my shepperd

  2. rayraj అన్నారు:

    ఈ బ్లాగు అద్వైతానికి క్రిస్టియానిటికీ సమన్వయం చేయబోయినట్టు ఉంది. కానీ మొదలు లోనే అగి పోయినట్టినిపించింది. ఇంకొంచం కృషి చేయకూడదు, ఓ సమన్వయ వ్యాసానికి ; మీకు రెండూ తెలుసు అనిపిస్తోంది ఈ నాలుగు వ్యాక్యాల్లో.

ప్రత్యుత్తరమిమ్ము