జనవరి 11, 2008
కథలు వ్రాసే వాడు = కథా రచయిత = కథకుడు
నవలలు వ్రాసే వాడు = నవలా రచయిత = నవలాకారుడు
వ్యాసాలు వ్రాసే వాడు = వ్యాస రచయిత = వ్యాస కర్త
కవితలు (కవిత్వం) వ్రాసే వాడు = కవి!
బ్లాగు/లు(బ్లాగోతం) వ్రాసే వాడు = బ్లాగు రచయిత = బ్లాగరి = బ్లావి!?
ప్రయోగం: 1. అతడు గొప్ప బ్లావి. 2. ఆమె ప్రఖ్యాత బ్లావ. 3.వారు యువ బ్లావులు.
అభిప్రాయములు |
తెలుగు పదం |
శాశ్వత లింకు
yuvaraju యొక్క టపా
జనవరి 7, 2008
బ్లాగ్లోకంలో “Thanks” (కృతఙ్ఞతలు) అనే అర్థంలో విరివిగా వాడబడుతున్న మాట: “నెనరులు”. అయితే దీన్ని ఇంకొంచెం సులభం చేసి “నెనళ్ళు” అనవచ్చని నా భావన.
ఉదాహరణకు:
ఊరు + లు = ఊరులు …. ఊళ్ళు
నీరు + లు = నీరులు …. నీళ్ళు
కుదురు+ లు = కుదురులు …. కుదుళ్ళు
చిగురు+లు = చిగురులు …. చిగుళ్ళు
నెనరు + లు = నెనరులు …. నెనళ్ళు!
ప్రేమతో, కరుణతో, కృతఙ్ఞతతో అనే అర్థంలో “నెనరుతో” అనేమాట ప్రాచుర్యమైనట్టు కనబడడంలేదు.
Leave a Comment » |
తెలుగు భాష |
శాశ్వత లింకు
yuvaraju యొక్క టపా
జనవరి 5, 2008
రెండు వేల సంవత్సరాలుగా అనేకులు తమ జీవితంలో ఎప్పుడో ఒకసారి ఈ ప్రశ్న అడిగివుంటారు. కొందరి నోట నేను విన్న సమాధానం : “అతడొక మంచి వ్యక్తి.ప్రవక్త.ఆ కాలం నాటి యూదులను ఎదిరించడంచేత సిలువ వేయబడ్డాడు.”
ఆయన విచిత్ర జననం గురించి, ఆయన చేసిన అద్భుత కార్యాల గురించి, ఆయన సిలువ మరణం గురించి మరియు ఆయన పునరుత్థానాన్ని గురించి ఎన్నెన్నో వివాదాలు. అయితే విశ్వసించే వారికి యేసు దేవుని కుమారుడు.కుమారుడైన దేవుడు. నరావతారియైన సృష్టికర్త.
అభిప్రాయములు |
సాధారణం |
శాశ్వత లింకు
yuvaraju యొక్క టపా